Revanth Reddy: జామర్ వాహనం లేకుండానే ట్యాంక్‌బండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో చూశారా..?
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. అయితే.. ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా పర్యవేక్షించారు.
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. అయితే.. ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా పర్యవేక్షించారు. ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు. క్రేన్-4 దగ్గర నిమజ్జనాలను సీఎం పరిశీలించారు. జామర్ వాహనం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. 3 వాహనాలతోనే ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. ప్రజలకు అభివాదం చేస్తూ గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు.
Published on: Sep 06, 2025 04:24 PM
