పోకిరీల ఓవరాక్షన్‌.. చార్మినార్‌ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు

Updated on: Oct 08, 2025 | 5:13 PM

హైదరాబాద్‌లో పోకిరీల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. పండుగల వేళ మహిళలను,బాలికలను వేధించడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా నగరానికే తలమానికం అయిన చార్మినార్ వద్ద విదేశీ పర్యాటకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తెలంగాణ పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, చార్మినార్ వద్ద కొంతమంది స్థానిక యువకులు టీ తాగుతూ ఉన్నారు. అదే సమయంలో, విదేశీ జంట ఒకటి చారిత్రక కట్టడం అందాలను తమ కెమెరాల్లో రికార్డ్ చేస్తూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. అప్పుడే, ఆ యువకుల్లో ఒక పోకిరి విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఆ మహిళ స్నేహితుడు వెంటనే గమనించి, ఆ పోకిరి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగానే జాగ్రత్త అంటూ సున్నితంగా హెచ్చరించారు. దానికి ఆ పోకిరి ఓకే బ్రదర్ అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే, ఈ మొత్తం సంఘటనను విదేశీ జంట తమ కెమెరాలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం వద్ద ఇలాంటి ఘటన జరగడం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. దేశం పరువు తీస్తున్నారు కదరా అంటూ ఆ పోకిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు నెటిజన్లు తెలంగాణ పోలీస్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై సీపీ సజ్జనార్ వెంటనే స్పందించి, ఆ పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్‌ వెజ్‌ విందు

మన టాప్ 10 యూట్యూబర్లు వీరే.. వందల కోట్లలో సంపద

TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానం

ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా

15 మంది భార్యలతో విదేశీ ట్రిప్‌… పేదరికంలో దేశం… రాజు జల్సా