Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్.. ? హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ మృతి

| Edited By: Ram Naramaneni

Aug 23, 2023 | 9:04 AM

చాలా యాక్టివ్ పనిచేసే శ్రీకాంత్.. తుపాకీ మిస్ ఫైర్ అయి చనిపోయాడా..? లేదా తానే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అతడి మృతిపై కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. తమతో ఎంతో కలిసిపోయి.. సరదాగా ఉండే వ్యక్తిని ఇప్పుడు విగత జీవిగా చూడలేక పోతున్నాం అని హుస్సేనీ ఆలం పోలీసులు బోరుమన్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ పేలుడు కలకలం రేపింది. ఓ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు. పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో భూపతి శ్రీకాంత్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకున్న శ్రీకాంత్.. పడుకునే సమయంలో చేతిలోని తుపాకీ ప్రమదవశాత్తు పేలింది. ఈ ఘటనలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడిఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కన్నుమూశాడు.

Published on: Aug 23, 2023 08:57 AM