CID Type Murder: తండ్రితో కలిసి భార్యను హతమార్చిన భర్త.. మామగారితో కలిసి భార్య కనిపించడంలేదంటూ ఫిర్యాదు..

Updated on: Dec 21, 2022 | 9:48 AM

ప్రాణం పొయ్యాల్సిన డాక్టరే ప్రాణం తీసాడు. అదికూడా సొంత భార్యను. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌


ప్రాణం పొయ్యాల్సిన డాక్టరే ప్రాణం తీసాడు. అదికూడా సొంత భార్యను. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ వందనా శుక్లాకు అభిషేక్‌ దీక్షిత్‌ అనే మరో డాక్టర్‌తో 2014లో వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కలిసి సీతాపూర్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్యా గొడవలు ప్రారంభం కావడంతో వందన వేరు ఆస్పత్రిలో పనిచేయడం ప్రారంభించారు. దాంతో అసహనానికి గురయిన అభిషేక్‌ తన తండ్రితో కలిసి భార్యను దారుణంగా హతమార్చాడు. వందనపై తండ్రి కొడుకులిద్దరూ కర్రలతో దారుణంగా దాడిచేసి హత్య చేశారు. అనంతరం వందన మృతదేహాన్ని ఓ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మర్నాడు ఉదయం డెడ్‌బాడీని ఓ పెట్టెలో పెట్టి ఘటనా స్థలానికి 350 కి.మీ. దూరంలోని గఢ్‌ముక్తేశ్వర్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లి దహనంచేశారు.ఇదిలా ఉంటే, తనకేమీ తెలియనట్టు మామగారితో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నవంబరు 27న మృతురాలి తండ్రి శివరాజ్‌ శుక్లా.. తన కుమార్తె కనిపించట్లేదని అల్లుడు అభిషేక్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా అంబులెన్స్‌ డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు తమదైనశైలిలో ప్రశ్నించారు. అతడి వాంగ్మూలంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 21, 2022 09:48 AM