Pamarru: తెల్లారి ఆలయానికి వెళ్లిన పూజారి.. గర్భగుడిలో కనిపించిన సీన్ చూడగా

Updated on: Apr 30, 2025 | 8:30 PM

ఎప్పటిలానే తెల్లారి ఆలయానికి వెళ్లిన పూజారి.. గర్భగుడిలో కనిపించింది చూడగా దెబ్బకు నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాచారాన్ని దేవాదాయ అధికారులకు అందించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా

కృష్ణా జిల్లాలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. పామర్రు మండలం అడ్డాడలోని గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి అందినంత దోచుకునిపోయారు. ఉదయాన్నే గుడి తలుపులు తీసిన పూజారి.. హుండీ తాళాలు, గర్భగుడి తాళాలు పగలుగొట్టి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, దేవాలయంలో ఏమేమి దొంగతనం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉండగా.. దేవాదాయశాఖ అధికారులు వచ్చిన తర్వాతే దేవాలయంలోకి వెళ్తామని తెలిపాడు ఆలయ పూజారి.

Published on: Apr 30, 2025 08:27 PM