Karimnagar: మానేరు నదిలో వల వేసిన జాలరి.. అతికష్టం మీద పైకి లాగి చూడగా.. బాబోయ్
సహజంగా..ఏ వలకైనా..నాలుగు..ఐదు కిలోల చేపల చిక్కుతుంటాయి..అప్పడప్పుడు..10 కిలోల బరువు ఉన్న చేపలు దొరుకుతాయి..కానీ..ఓ మత్స్య కార్మికుడు వలకు 25 కిలోల చేప చిక్కింది..ఈ చేప ను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్‌కి ఎల్ఎండి మానేరు డ్యామ్‌లో ప్రతి రోజు చేపలు పడుతున్నారు. చిన్న సైజ్ ఉండే చేపలు మాత్రం పడుతున్నాయి. పట్టిన చేపలు మార్కెట్‌లో అమ్ముతున్నాడు. ప్రతి రోజులాగే.. చేపలు పట్టేందుకు డ్యామ్‌లోకి దిగాడు. వలను తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ వలపైకి రావడం లేదు. ఎంత లాగిన పైకి రావడం లేదు. అతి కష్టం మీద వలపైకి వచ్చింది. అందులో భారీ సైజులో ఉన్న చేప కనపడింది. సుమారుగా 25 కిలోల బొచ్చే చేప వలకు చిక్కింది. మరో వ్యక్తి సహాయంతో..ఆ చేపను వల నుంచి బయటకు తీసుకువచ్చారు. సుమారుగా 25 కిలోల బరువు ఉంది చేప. ఇంత పెద్ద సైజులో ఉన్న చేపను చూడటానికి స్థానికులు తరలి వచ్చారు. ఎప్పుడు ఇలాంటి చేప వలలో చిక్కలేదని మత్స్య కార్మికుడు చెబుతున్నారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపారు.