Uttarakhand: గంటల్లో గొట్టపు మార్గాన్నితొలచి సిద్ధం చేసిన కార్మిక నిపుణులు.! వీడియో
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. యావద్దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలతో, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. ఎస్డీఆర్‌ఎఫ్, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగం.,
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. యావద్దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలతో, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. ఎస్డీఆర్‌ఎఫ్, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వంటివి అనేకం రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపుమార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివర్లో చిక్కుముడి ఎదురైంది. దాదాపు 12 మీటర్ల మేర ఇంకా తవ్వాల్సి ఉండగా 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలై ఆశలపై నీళ్లు జల్లింది. సన్నని మార్గం ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్నవాటిని వారు విజయవంతంగా తొలగించగలిగారు.
వీరు కొన్ని చిన్నచిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రానికి ఒక దశలో మరో రెండుమీటర్ల పని మాత్రమే మిగిలి ఉండడంతో అటు సహాయక బృందాల్లో, ఇటు కూలీల కుటుంబికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లోనే.. అటు నుంచి తవ్వుతున్న శబ్దం తమకు వినిపించడంతో లోపలున్న కూలీలు తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు. లోపలకు వచ్చిన కార్మికులను చూసి వారు సంబరపడి తమ వద్దనున్న ఎండుఫలాలు అందించి ఆనందం పంచుకున్నారు. మరికాసేపట్లోనే గొట్టపు మార్గం సిద్ధం కావడం, దాని నుంచి ఒక్కొక్కరు పాకుతూ బయటకు రావడం సజావుగా సాగిపోయింది. కూలీలను వెంటనే వైద్య చికిత్సకు తరలించారు. రోజుల తరబడి సొరంగంలోనే ఉన్న కూలీల ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులపాటు క్షుణ్నంగా పరిశీలించి, వారు అన్నివిధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపించనున్నారు. అందరిలో అత్యంత చిన్న వయసు వ్యక్తిని మొదటగా బయటకు తీసుకువచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.