ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్‌’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు

Updated on: May 01, 2025 | 4:33 PM

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. ఈ ఘటనలో పలువురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అసోంకి చెందిన ఓ ప్రొఫెసర్.. ఖురాన్‌లోని కల్మా ఏంటో తెలియకపోయినా.. దానిని చదువుతున్నవారితో శ్రుతి కలిపి దాడి నుంచి తప్పించుకున్నారు. అలాగే, ఘటనా స్థలానికి వెళ్లడం ఆలస్యం కావడంతో కేరళకు చెందిన ఓ కుటుంబం దాడి నుంచి తప్పించుకుంది. తాము ఆర్డర్ చేసిన ఆహారం ఉప్పు ఎక్కువ కావడంతో లంచ్‌కు మళ్లీ ఆర్డర్ చేసింది. అదే వారి ప్రాణాలు కాపాడింది. కేరళకు చెందిన అల్బీ జార్జ్, ఆయన భార్య లావణ్య, వారి పిల్లలు, లావణ్య తల్లిదండ్రులు, మేనమామలు, మేనకోడళ్లు, వారి పిల్లలు కలసి ఏప్రిల్ 18న కొచ్చి నుంచి కశ్మీర్ పర్యటనకు బయలుదేరారు. ఏప్రిల్ 19న శ్రీనగర్‌కి చేరుకుని, రెండు రోజుల పాటు గుల్మర్గ్, సోన్మార్గ్‌ను సందర్శించారు.

మంగళవారం బైసరన్‌కు వెళ్లే ముందు ఖచ్చితంగా తినాల్సిందేనని తన భర్త పట్టుబట్టారనీ ఆమె చెప్పారు. రోడ్డుపక్కన ఉన్న ఓ రెస్టారెంట్‌ వద్ద ఆగి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశామనీ అందులో ఉప్పు ఎక్కువ కావడంతో రెస్టారెంట్ సిబ్బంది మళ్లీ తయారు చేస్తామని చెప్పడంతో అలా దాదాపు గంటసేపు అక్కడే ఉండిపోయారనీ అన్నారు. తరువాత భోజనం ముగించుకుని ప్రయాణం కొనసాగించిన ఆ కుటుంబం బైసరన్ లోయకు కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో ఉండగానే ఏవో శబ్దాలు వినిపించాయి. గుర్రాలు భయంతో వెనక్కి పరుగులు తీయడం, టాక్సీలు వేగంగా దిగి వస్తుండటం చూసారు. పర్యాటకులు అరుస్తున్నారు కానీ వారి భాష అర్థం కాలేదని లావణ్య పేర్కొన్నారు.అటుగా వస్తోన్న ఒక కారును ఆపి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. డ్రైవర్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు, పర్యాటకుల మధ్య జరిగిన సమస్యగా కనిపించిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు త్వరగా పరిష్కారమైపోతాయని, ముందుకు వెళ్లమని అతడు చెప్పాడట. కానీ తీవ్రతను గ్రహించి ఆ ఫ్యామిలీ తిరిగి వెనక్కి వచ్చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్‌..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో

Published on: May 01, 2025 04:32 PM