AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!

వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!

Samatha J
|

Updated on: Aug 12, 2026 | 1:18 PM

Share

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు. 150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతరం గీతానికి రక్షణ శాఖ ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది. మరోవైపు, తమిళనాడులో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

భారతావని 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక సందర్భంలో, భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు. ఇది వందేమాతరం గీతానికి లభించిన అరుదైన గౌరవం. ఈ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రక్షణ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వాన పత్రికలలో కూడా వందేమాతరం సాహిత్యాన్ని ప్రత్యేకంగా పొందుపరిచారు.మరోవైపు, తమిళనాడులో కూడా తమ రాష్ట్ర గీతానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే అన్ని కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని తప్పనిసరిగా ఆలపించేలా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. గతంలో తమిళ్ తాయ్ వాళ్తుకు తగిన గౌరవం లభించలేదంటూ అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది తమిళ భాష, సంస్కృతి, నాగరికత ప్రాచీనతను నొక్కి చెబుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

Follow Us