రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

Updated on: Sep 25, 2025 | 8:14 AM

హిమాచల్ ప్రదేశ్‌లోని రాంలీలా ప్రదర్శన సమయంలో 70 ఏళ్ల నటుడు అమరేష్ మహాజన్ దశరథుడి పాత్ర పోషిస్తుండగా వేదికపై కుప్పకూలి మరణించారు. ఈ ఘటన చంబా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆయన గత 25 ఏళ్లుగా రాంలీలా ప్రదర్శనలో నటిస్తూ వస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతం, చంబా చౌగాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రాంలీలా నాటక ప్రదర్శన సందర్భంగా ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల అనుభవజ్ఞుడైన నటుడు అమరేష్ మహాజన్, దశరథ మహారాజు పాత్రలో నటిస్తుండగా వేదికపై కుప్పకూలి మరణించారు. గత 25 ఏళ్లుగా ఈ రాంలీలా నాటకాల్లో నటిస్తూ వస్తున్న అమరేష్ మహాజన్, దశరథుడు, రాముడి పాత్రలకు పెట్టింది పేరుగాంచారు. వయసు పైబడినప్పటికీ, ఆయన ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంతో ఈ ప్రదర్శనలో పాల్గొనేవారు. ఈసారి కూడా, ఆయన దశరథుడి పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. సుమారు 8:30 గంటల సమయంలో, సింహాసనంపై కూర్చుని సంభాషణలు చెబుతున్న సమయంలో ఆయన ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయారు. మొదట ప్రేక్షకులు, సహనటులు దీన్ని నటనలో భాగంగా భావించారు. కానీ, కొంత సమయం తర్వాత ఆయనలో కదలిక లేకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే వైద్య సహాయం కోసం కేకలు వేశారు.

మరిన్నివీడియోల కోసం :

Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో

సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో

Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో