ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Jul 17, 2024 | 6:29 PM

గురువారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నాటికి పశ్చిమ మధ్య..

గురువారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు రేపటి నుంచి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

అటు తెలంగాణలో వెదర్‌ అలర్ట్‌ను పరిశీలిస్తే.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం బలహీన పడింది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది..వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఈ రాత్రికి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on