AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rains: : తెలంగాణలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన

Telangana Rains: : తెలంగాణలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన

Ram Naramaneni
|

Updated on: Aug 29, 2025 | 9:17 AM

Share

వాతావరణ శాఖ తెలంగాణలోని ఆరు జిల్లాలకు భారీ వర్షాలను సూచించింది. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలుల కలయిక ఈ వర్షాలకు కారణమని వివరించింది.

తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి వైపు వంపుతి రిగిన ఉపరితల ఆవర్తనం… బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు ఈ వర్షాలకు కారణం. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలపై అధిక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండటంతో ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం కూడా ఈ వర్షాలకు దోహదం చేస్తోంది. సముద్ర ఉపరితలంలోని 8 కి.మీ సర్కులేషన్ వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు తెలంగాణ మీద కలిసి భారీ వర్షపాతానికి దారితీస్తున్నాయి. గత 24-48 గంటల్లో కామారెడ్డిలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 60 సెం.మీ., సిద్ధిపేటలో 20 సెం.మీ. కంటే ఎక్కువ, మెదక్ లో 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.

 

Published on: Aug 29, 2025 09:09 AM