Shamshabad Airport: అమృత్‌సర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికుడు.. లగేజ్ చెక్ చేయగా
శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒక ప్రయాణికుని సామానులో ఎనిమిది లైవ్ బుల్లెట్లను కనుగొన్నారు. పంజాబ్‌కు చెందిన సుఖ్దీప్ సింగ్ అనే ప్రయాణికుడు తన వద్ద ఉన్న బుల్లెట్లకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు చూపలేదు. 2023లో పంజాబ్‌లో జరిగిన ఒక ఘటన వల్ల ఈ బుల్లెట్లు తన వద్ద ఉన్నాయని అతను వివరించాడు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్‌లు కలకలం రేపాయి. అమృత్‌సర్ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుని లగేజీ బ్యాగ్‌లో 8 లైవ్ బుల్లెట్లు గుర్తించిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన సుఖ్దీప్ సింగ్ అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అతని లగేజీ బ్యాగ్‌ను సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేయగా బుల్లెట్స్ బయటపడ్డాయి. బుల్లెట్స్‌కు సంబంధించి.. సుఖ్‌దీప్‌సింగ్ ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో.. అదుపులోకి తీసుకుని విచారించారు. 2023లో పంజాబ్‌లో జరిగిన ఓ ఘటన వల్ల బుల్లెట్స్ తన దగ్గర ఉన్నాయన్నారు. దీంతో కేసు నమోదు చేసి.. నిందితుడ్ని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

