Rain Alert: ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ్. మరి వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతోంది.? ఉరుములు, మెరుపులతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందట. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్టోరీపై లుక్కేయండి.
ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది..గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jul 28, 2025 08:58 AM