AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె లైఫ్ పెంచే.. మ్యాజిక్ లీఫ్.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన వీడియో

గుండె లైఫ్ పెంచే.. మ్యాజిక్ లీఫ్.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన వీడియో

Phani CH
|

Updated on: Jul 21, 2025 | 8:13 PM

Share

మనదేశంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా యువతలోనూ ఊహించని స్థాయిలో ఈ తరహా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, మారుమూల ప్రాంతాల్లో, ఎలాంటి వైద్య సదుపాయాలు లేని చోట ఎవరికైనా గుండెపోటు వస్తే.. ప్రథమ చికిత్సలో భాగంగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి వేప ఆకుల రసాన్ని తాగిస్తే ప్రాణాపాయం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటు వచ్చినప్పుడు సహజంగా ఛాతీ నొప్పి ఉంటుంది. కొందరిలో తేలికగా, మరికొందరిలో గుండెను పిండేసినట్లుగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొందరిలో ఏ హడావుడూ లేకుండా.. నిశ్శబ్ద గుండెపోటు సంభవిస్తుంది. కొందరు స్త్రీలలో, గుండెపోటుకు ముందు వాంతులు లేదా వెన్నునొప్పి ఉండొచ్చు. ఇంకొందరిలో ఛాతీ నొప్పి క్రమంగా భుజాలు, చేతులు, వీపు, మెడ వరకు పాకటమే గాక.. తీవ్రంగా చెమటలు పట్టడం, మైకం కమ్మినట్టుగా అనిపిస్తుంది. గుండెపోటు లక్షణాలుంటే.. వెంటనే ఆంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్లాలి. ఒకవేళ..డాక్టర్ నేరుగా అందుబాటులో లేకపోతే.. వైద్యుడి సలహా మీద యాస్పిరిన్ తీసుకోవాలి. దీనివల్ల రక్తం పలుచబడి గుండెకు ఏదో ఒక మేర రక్త సరఫరా మెరుగుపడి, గుండెపోటు తీవ్రత తగ్గుతుంది. గుండెపోటు వల్ల మనిషి అపస్మారక స్థితిలోకి పోతే.. వెంటనే CPR చేస్తూ.. వైద్య సహాయం కోసం ట్రై చేయాలి. మారుమూల ప్రాంతాల్లో గుండెపోటు వచ్చి, ఏ రకమైన వైద్యసాయం అందే పరిస్థితి లేనప్పుడు.. ప్రథమ చికిత్సలో భాగంగా.. బాధితుడి నాలుకపై రెండు చుక్కల వేపాకు రసం వేయాలి. మధుమేహులలో అధిక చక్కెర వల్ల గుండెపోటు సంభవిస్తే.. వేపాకు రసం వల్ల చక్కెర స్థాయిలు తగ్గి.. గుండెపోటు తీవ్రత కూడా నెమ్మదిస్తుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే తప్ప వైద్యచికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాలో అయ్యే ముందు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది. అసలు సమస్య రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారం, కేకులు, పేస్ట్రీలకు బదులు రోజూ 10 బాదం గింజలు, 4 వాల్‌నట్స్, బ్రొకలీ వంటివి తీసుకుంటూ… ఒక అరగంట పాటు నడక, పావుగంట పాటు యోగా, ప్రాణాయామం వంటివి చేయటం వల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషుల సమాధుల మధ్య రెస్టారెంట్‌.. అవే నా అదృష్టం అంటున్న ఓనర్

ఇంటి కరెంట్‌ బిల్లు చూసి షాక్‌ తిన్న రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌.. ఏకంగా

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు

భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!

విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ