భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉందా? వీడియో
భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా? డయాబెటిస్ ఉన్నవారు భోజనం తర్వాత టీ తాగడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. భోజనం చేసిన తర్వాత టీ తాగడం కొంతవరకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం తిన్నెంటనే టీ తాగితే జీర్ణ వ్యవస్థకు పోషక పదార్థాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
టీలో ఉండే కొన్ని గుణాలు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అన్నం తిన్న మెంటనే టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తీవ్రతరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీలో ఉండే టానిన్లు, కాఫిన్ వంటి రసాయనాలు జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తిన్న తర్వాత వెంటనే టీ తాగడం మానుకోండి. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల ఇందులో ఉండే కాఫిన్ మెదడుపై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే కడుపులో నొప్పి, ఉబ్బసం, తలతిరగడం వంటి సమస్యలు రావచ్చు. భోజనం చేసిన వెంటనే టీ తాగితే అందులో ఉండే కాఫిన్ మెదడుపై ఒత్తిడి చూపే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కడుపులో ఆమ్లత పెరిగి యాసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే యాసిడిటీ, పొట్టనొప్పి, జీర్ణక్రియ సమస్యలు ఉంటే అన్నం తిన్న తర్వాత టీ తాగడం మానుకోవడం చాలా మంచిది. టీలో ఉండే ఫాస్ఫొరిక్ యాసిడ్ ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాఫిన్ రక్తపోటును పెంచుతుంది. భోజనం తర్వాత టీ తాగితే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో
ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు