తింటే చావడమే..! హోటళ్లలోని ఫ్రిజ్‌లలో గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు

Updated on: Feb 10, 2026 | 9:57 PM

గుంటూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ కంట్రోల్, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు పెద్ద మొత్తంలో లభించాయి. రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన వండిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లపై ఫుడ్ కంట్రోల్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నాణ్యత దారుణంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, ఫ్రిజ్‌లలో కిలోల కొద్దీ గడ్డకట్టిన చికెన్, మటన్, చేపలు లభించాయి. ఒకసారి వండిన ఆహారాన్ని చాలా రోజులుగా ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలు, స్వీట్ షాపుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని నిల్వ చేయడంతో పాటు హానికరమైన రంగులు, కెమికల్స్‌ను కూడా వాడుతున్నారని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన ఆహార పదార్థాలతో పాటు బిస్మిల్లా హోటల్ వంటి చోట్ల పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లను గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే

CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్

Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు

Loading...
Unable to load recommendations.
Follow Us