Moringa Leaves: అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!

| Edited By: TV9 Telugu

Dec 05, 2024 | 4:24 PM

Moringa leaves Benefits: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాయలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాయలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మునగను పోషకాల పవర్​హౌజ్‌గా పిలుస్తారు. మునగాకులో విటమిన్‌ C పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

బాలింతలు, పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మునగాకు ఊబకాయం, బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా లభిస్తుంది. పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది. మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా పొందవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 12, 2024 06:49 PM