చీరకట్టులో పురుషుల గర్బా డ్యాన్స్‌.. ఎందుకంటే ??

Updated on: Oct 02, 2025 | 3:18 PM

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ఆరాధ్య దైవం దుర్గామాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నారు ప్రజలు. పూజలు, భజనలు, నృత్యాలతో అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అయితే గుజరాత్​లోని ఓ ప్రాంతంలో మాత్రం నవరాత్రులు భిన్నంగా జరుగుతున్నాయి. అక్కడ ఉన్న బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు స్త్రీల మాదిరిగా చీరలు ధరించి గర్బా నృత్యం చేస్తారు.

దీనివెనుక పెద్ద కారణమే ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో పురుషులు.. చీరకట్టులో గర్బా ఆడే సంప్రదాయం సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతోంది. విస్నగర్ కల్యాణి కుటుంబానికి చెందిన కుమార్తె, బరోట్ కమ్యూనిటీకి చెందిన కోడలు శ్రీ సదుబెన్ అహ్మదాబాద్​‌లో నివసించేది. ఆ సమయంలో ఒక మొఘల్ సభాపతి.. ఆమెను పెళ్లాడమని ఒత్తిడి చేశాడు. దీంతో.. ఆమె రక్షణ కోసం సదుబెన్ బరోట్ సామాజిక వర్గం వారిని సాయం కోరింది. అయితే, వారు.. ఆమెను మొఘలుల బారినుంచి కాపాడలేకపోయారు. ఈ క్రమంలోనే సదుబెన్ బిడ్డ కూడా మరణించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదుబెన్ బరోట్ సామాజిక వర్గపు పురుషులంతా పిరికివారుగా మారిపోతారని శపించి.. అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఈ సంఘటన 1825వ సంవత్సరంలో జరిగింది. ఈ ఘటన తర్వాత బరోట్ కుల పెద్దలలో ఆమె శాపం కలవరాన్ని కలిగించింది. దీంతో, వారంతా సదుబెన్‌ ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి, శాప విముక్తి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. సదుమతాని పోల్ అని పిలిచే ఆ ఆలయంలో.. బరోట్, గైక్వాడి, మేలి తదితర సామాజిక వర్గాల వారు నిత్యం పూజలు చేస్తూ వచ్చారు. సదుబెన్‌ను వారు తమ కులదైవంగా ఆరాధిస్తున్నారు. అలాగే, గత 200 ఏళ్లుగా సదుబెన్‌ శాపం నుంచి విముక్తి కోసం బరోట్ సామాజిక వర్గపు పురుషులు..నవరాత్రి ఎనిమిదో రోజున చీరలు ధరించి గర్బా నృత్యం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీనివల్ల తమ తప్పుకు ప్రాయశ్చితం దొరుకుతుందని భావిస్తారు. గర్బాకు ముందు వారంతా సదుబెన్ పాదాలపై పడి వేడుకుంటారు. ఈ గర్భాను చూసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు ఈ సంప్రదాయాన్ని మహిళ పట్ల మర్యాద, గౌరవానికి చిహ్నంగా భావిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దసరా రోజు పాలపిట్టను చూడాలి.. ఎందుకంటే ??

భారీ భూకంపం.. 69 మంది మృతి

అమెరికా షట్‌డౌన్‌.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే

సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ

అమ్మో.. అల్పపీడనం వారం రోజులు వానలే