GST 2.0: ఇది కదా కావాల్సింది.. ప్రజలకు దసరా, దీపావళికి బంపర్ బొనాంజా..

Updated on: Sep 04, 2025 | 1:04 PM

నిత్యావసర వస్తువులపై 18శాతం ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గించింది కేంద్రం. హెయిర్‌ ఆయిల్‌, టూత్‌పేస్ట్‌, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షేవింగ్ క్రీమ్, బటర్‌, నెయ్యి, చీజ్‌, కాఫీ-టీ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి. మరి ఏవేవి తగ్గనున్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఆ వివరాలు..

దసరా, దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్‌ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధాని మాటలను నిజం చేస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఐదు శాతం, రెండోది 18శాతం. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. లగ్జరీ ఐటెమ్స్‌పై 40 పర్సెంటేజ్‌ విధించింది. కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లను ఈనెల 22నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్రం