కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
హైదరాబాద్ గోల్కొండ పెళ్లి బారాత్‌లో ఓ మహిళ రెండు కత్తులతో ప్రమాదకర డాన్స్ చేసింది. ఇలాంటి విన్యాసాలు చట్టవిరుద్ధం, ప్రాణాలకు హానికరం. గతంలో పదును లేని కత్తులు వాడేవారు కానీ ఇప్పుడు నిజమైన కత్తులతో చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా, కేసులు పెట్టినా ఇలాంటి చర్యలు ఆగడం లేదు. పౌరులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పెళ్లి బారాత్‌లో చిన్నా,పెద్దా అంతా డాన్సులు చేయడం సహజం. కానీ ఓ మహిళ డాన్స్ పేరుతో ఏకంగా కత్తులతో విన్యాసాలు చేస్తూ హల్చల్ చేసింది. హైదరాబాద్ నగరం గోల్కొండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈమధ్య హైదరాబాద్ నగరంలో పెళ్లి బరాత్‌ల్లో కత్తులతో విన్యాసాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. వేడుకల్లో భాగంగా ఒకప్పుడు పదును లేని కత్తులతో విన్యాసాలు చేసేవాళ్లు. కానీ, పోనుపోను ఆ సంస్కృతి హద్దులు దాటి నిజమైన కత్తులు ఉపయోగిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ఓ మహిళ తన సన్నిహితులతో కలిసి రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని డాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి భయం లేకుండా అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఆ మహిళ కత్తులు తిప్పడం స్థానికంగా కలకలం రేపింది. వాస్తవానికి ఇలా నిజమైన కత్తులు పట్టుకొని విన్యాసాలు చేయడం చట్టపరంగా నేరం కావడంతో పలు ప్రాంతాలలో పోలీసులు కేసులు కూడా నమోదు చేసి జైలుకి పంపించారు. అయినప్పటికీ ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలను మానుకోవాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించిన ఘటనలు కూడా ఉన్నాయి. హద్దులు దాటే విన్యాసాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ లేకపోలేదు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని హెచ్చరించాలని.. మరోమారు ఇలాంటివి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కసారి కడితే చాలు.. జీవితాంతం బీమా.. ఎల్‌ఐసీ కొత్త స్కీమ్
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

