Ganesha Visarjan 2025: మిలాద్ ఉన్ నబీ వాయిదా.. గణేష్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ పర్యటించారు. స్థానికులతో పాటు మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు పలు ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చ్ నిర్వహించారు పోలీసులు..

6వ తేదీ గణేష్ శోభాయాత్రతో పాటు మిలాద్ ఉన్ నబీ ఉండటంతో పండుగను వాయిదా వేసుకున్నారు ముస్లిం పెద్దలు. నిమజ్జనం తర్వాత 14వ తేదీ పండుగ జరుపుకుంటామంటూ ఎంఐఎం నేతలతో పాటు ముస్లిం మతపెద్దలు సీఎంను కలిసి వినతిపత్రం అందించారు.
మరోవైపు ట్యాంక్‌బండ్‌లో చిన్న వినాయకుల నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం నిమజ్జనం చేసే చోట మినహా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఇనుప జాలీలు ఏర్పాటు చేశారు అధికారులు..