సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి లాజిస్టిక్స్ లీడర్‌దాకా.. టాటా ACEతో అంచెలంచెలుగా ఎందిగిన గౌరవ్ శర్మ వ్యాపార సామ్రాజ్యం!
ట్రక్స్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, ఫౌండర్ గౌరవ్ శర్మ.. టాటా ACEకి తన దార్శనికతను జోడించి లాజిస్టిక్స్ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రారంభ దశలో ఇ-కామర్స్ డెలివరీలకు మాత్రమే పరిమితమైన వ్యాపారం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
వేగం, దిశ రెండూ సరైన చోట ఉంటేనే ఆ ప్రయాణం విజయవంతమవుతుందని ప్రముఖ లాజిస్టిక్స్ బిజినెస్ మ్యాన్ గౌరవ్ శర్మ అంటున్నారు. ఇదే నమ్మకం ఒకప్పుడు ఢిల్లీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన గౌరవ్ శర్మ ప్రయాణ దిశను మార్చింది. వివిధ వ్యాపార యజమానులతో ఆయనకున్న పరిచయాలు వ్యవస్థాపకతకు బీజాలు వేసింది. అంతే 2018 నాటికి గౌరవ్ ట్రక్స్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. టెక్-ఫార్వర్డ్ విధానంతో సాంప్రదాయ లాజిస్టిక్స్‌ను విప్లవాత్మకంగా మార్చారు.
అయితే ఆయన వెంచర్ ప్రారంభ దశలో ఇ-కామర్స్ డెలివరీలకు మాత్రమే పరిమితమైంది. కానీ 2021లో గౌరవ్ శర్మ తన వ్యాపారంలో టాటా ACE ట్రక్కులను ప్రవేశపెట్టారు. ఆయన వ్యాపార కార్యకలాపాలను టాటా ACE ట్రక్కులు మరింతగా అభివృద్ధి చేశాయి. కేవలం రెండు టాటా ACE ట్రక్కులతో ప్రారంభమైన గౌరవ్ లాజిస్టిక్స్ ఫ్లీట్.. అనతి కాలంలోనే అత్యంత వేగంగా విస్తరించింది. నేడు అయన కంపెనీలో ఏకంగా 280 టాటా ACE వాహనాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 250 టాటా ACE ట్రాక్కులు గౌరవ్ శర్మ వ్యాపారానికి వెన్నెముకగా పని చేస్తున్నాయి. అమెజాన్, ఢిల్లీవరీ, ఎకార్ట్, బ్లూ డార్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీల విశ్వాసంతో గౌరవ్ ఎంతో గర్వంగా తన విజయానికి ‘అబ్ మేరీ బారీ’ అని చెబుతున్నారు.