మతిమరుపు మంచిదే.. మర్చిపోకుంటేనే డేంజర్… ఎందుకలా ??
ఏదో ఫంక్షన్ లో ఎవరో కనిపించారు... ఎక్కడో చూసినట్టు, బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వారి పేరేంటో వెంటనే తట్టదు. ఏదో చెబుదామని మీ స్నేహితుడి దగ్గరికి వెళ్లారు. మాట్లాడుతుండగానే అసలు విషయం మర్చిపోయారు. ఏదో చెబుదామని వచ్చా, గుర్తుకురావట్లే అని తలపట్టుకుంటారు.. చాలా మందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవాలు ఎదురువుతూనే ఉంటాయి.
అమ్మో మతిమరుపు వస్తోందేమో అని ఆందోళన మాత్రం అవసరం లేదు. ఎందుకంటే మతిమరపు మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, మెమరీని అప్‌డేట్ చేసుకోవడానికి జరిగే ప్రక్రియలో మతిమరుపు ఓ భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు మనిషి మనుగడకు ఇది అత్యంత అవసరమని తేల్చి చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడి బతికేవారు. దగ్గర్లోని చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఎప్పుడైనా అలా వెళ్లినప్పుడు… సింహం, పులి వంటి క్రూర జంతువులు కనిపిస్తే, ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్‌డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మరో చెరువు వెతుక్కోవాలని ప్రేరేపిస్తుంది. ఇది మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన మెదడులోని కణాలు మధ్య ఏర్పడే బంధాలు ఎంత దృఢంగా ఉంటే… అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. లేదా ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు… ఆ అంశానికి సంబంధించిన బంధాలు బలంగా ఏర్పడి జ్ఞాపకంగా మారుతాయి. దానిపై ప్రత్యేకంగా ఆలోచించే పనిలేకుండా… ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిపైనైనా సరిగా శ్రద్ధపెట్టకుంటే… బంధాలు బలహీనంగా ఉండి, జ్ఞాపకం సరిగా నమోదుకాదు.. అలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగించేస్తుంది. అదే మతిమరుపు. అక్కడ కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటుంది. ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రక్తం తాగి బతికే వాంపైర్ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??
నా బ్రెయిన్‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్
మహిళా కి”లేడీ”లు.. లోన్ పేరుతో భారీ దోపిడీ !!
వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు