Viral Video: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు.. ఎందుకో తెలిస్తే

Viral Video: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు.. ఎందుకో తెలిస్తే

Ravi Kiran

|

Updated on: Jun 17, 2024 | 12:24 PM

సాధారణంగా నదిలోకో, గోదాట్లోకో దూకిన వ్యక్తులను ఎవరినైనా.. ఠక్కున అక్కడే ఉన్న స్థానికులు దూకేసి కాపాడేస్తారు. అయితే ఇక్కడొక మత్స్యకారుడు కూడా నదిలోకి దూకిన వారిని తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.. ఒడ్డుకు లాక్కొచ్చిన అతడ్ని..

సాధారణంగా నదిలోకో, గోదాట్లోకో దూకిన వ్యక్తులను ఎవరినైనా.. ఠక్కున అక్కడే ఉన్న స్థానికులు దూకేసి కాపాడేస్తారు. అయితే ఇక్కడొక మత్స్యకారుడు కూడా నదిలోకి దూకిన వారిని తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.. ఒడ్డుకు లాక్కొచ్చిన అతడ్ని.. ఆపై కోపంతో ఊగిపోయి పొట్టుపొట్టున కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రేమ జంట గోమతి నది దగ్గరకు వచ్చి బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఇక అక్కడే ఉన్న మత్స్యకారులు దీన్ని గమనించి.. వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకి వారిద్దరిని కాపాడారు. కొందరు మత్స్యకారులు ఓవైపు అమ్మాయిని కాపాడి బ్రిడ్జి పిల్లర్‌పై కూర్చోబెట్టగా.. మరోవైపు ఒడ్డుకు తీసుకువచ్చిన ప్రియుడిని పనికిమాలిన పని చేశావంటూ ఓ మత్స్యకారుడు అతడి చెంప పగలకొట్టాడు. ఇదేం చెత్తపని అంటూ కోపంతో ఊగిపోయి.. పదేపదే అతడి చెంప వాయించాడు సదరు మత్స్యకారుడు. అనంతరం ఆ ప్రేమజంటను పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..