Fig Fruit: ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?

|

Nov 02, 2024 | 6:06 PM

మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో అంజీరా ఒకటి కాగా ఈ పండ్లను అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. అత్తి పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు కొన్ని మొండి వ్యాధులు సైతం సులువుగా నయమవుతాయి. మొటిమల నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఈ పండ్లు తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్లకు ఈ పండ్లు దివ్యౌషధం అని చెప్పవచ్చు.

అత్తి పండ్లను అంజీరా పండ్లు లేదా ఫిగ్స్‌ అని కూడా అంటారు. ఈ పండ్లను చాలా మంది బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ లాంటి ఇతర డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఆరోగ్యం కోసం తీసుకుంటారు. దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ పెరిగి ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు. నిద్రలేమి సమస్యను కూడా అంజీరా పండ్లతో సులువుగానే అధిగమించవచ్చు. శరీరంలో సెరోటినిన్ స్థాయిలను మెరుగుపరిచే అంజీరా.. డిప్రెషన్ ను సైతం తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో పీచు పుష్కలంగా ఉండటంతో పాటు ప్రో బయోటిక్స్ సైతం ఉంటాయి కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి. అయితే అత్తి పండ్లను చాలామంది శాకాహార పండు అని భావించినా ఈ పండును కొంతమంది మాత్రం మాంసాహార పండు అనుకుంటారు. ఈ పండు ఉత్పత్తి అయ్యే ప్రక్రియ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

కొన్ని రకాల అత్తి పండ్ల అభివృద్ధికి తూనీగలు, కందిరీగలు అవసరం కాగా కొన్ని అత్తి పండ్లలో వీటి గుడ్లు, లార్వాలు పెరుగుతాయని తెలుస్తోంది. కొన్నిరకాల అత్తి పండ్లు తూనీగలు, కందిరీగల పరాగ సంపర్కం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. అయితే ఆధునిక కాలంలో అత్తి పండ్లను ఇతర విధానాల ద్వారా కూడా అభివృద్ధి చేస్తున్నారని తెలుస్తోంది. ఉపవాసం సమయంలో డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు అంజీరాకు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అంజీరా పండ్లను తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ స్టోరీలో మేం అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిలోని సూచనలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on