మీ కళ్లు చెబుతాయి ఇక.. మీ వ్యాధులేమిటో !!

Updated on: Nov 17, 2025 | 4:04 PM

కళ్ళు గుండె వ్యాధుల ప్రమాదాన్ని, వృద్ధాప్యం వేగాన్ని ఎలా వెల్లడిస్తాయో తాజా పరిశోధనలో తేలింది. మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 74,000 మందిపై రెటీనా స్కాన్లు, రక్త నమూనాలతో అధ్యయనం చేశారు. కంటిలోని రక్తనాళాలను పరిశీలించడం ద్వారా గుండె ఆరోగ్యం తెలుస్తుందని, వృద్ధాప్య స్థితిని అంచనా వేయవచ్చని కనుగొన్నారు. భవిష్యత్తులో ఔషధాల తయారీకి సహాయపడే రెండు కీలక ప్రొటీన్లను కూడా గుర్తించారు.

ముఖం చూసి ఆ మనిషి మూడ్‌ ఏంటో చెప్పేస్తాం. నవ రసాలను పలికించే కళ్లు గుండె వ్యాధుల్ని ముందే తెలియపరుస్తాయట. కళ్లలోకి చూసి గుండె ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చనీ అలాగే వృద్ధాప్యంలోకి ఎంత వేగంగా వెళుతున్నాం అనేది కూడా కచ్చితంగా తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కంటిలోని చిన్న రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎంత ఉందో తెలిసిపోతుందట. అంతేకాదు వృద్ధాప్య స్థితిని కూడా కళ్లు చెప్పేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు 74 వేల మందిపై పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడించారు. రెటీనా స్కాన్లు, జన్యు డేటా, రక్త నమూనాలను సేకరించి విశ్లేషించి పరిశోధించారు. కళ్ల ద్వారా గుండె సమాచారం తెలుసుకోవడం ఆసక్తికరం. ఈ అధ్యయనంలో మరో ముఖ్య అంశం రక్తనాళాలలో వచ్చే మార్పులకు కారణమవుతున్న రెండు ముఖ్యమైన ప్రోటీన్లను కనుగొనడం. వృద్ధాప్యం వేగాన్ని నెమ్మదింప చేసి, గుండె వ్యాధుల భారాన్ని తగ్గించడానికి.. భవిష్యత్తులో ఔషధాల తయారీకి, జీవితకాలాన్ని మెరుగుపరచడానికి. ఈ ప్రొటీన్లు ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ కూతురి గొడవ కోర్టు అసహనం

అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి

సినిమా నుంచి యూటర్న్‌ !! లోగుట్టు ఏమై ఉంటుంది ??

థియేటర్ లో చున్నీ వివాదంపై నోరు విప్పిన డైరెక్టర్

రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్‌