Gangula Kamalakar: సింగర్‌గా మారిన మాజీ మంత్రి.. బీసీ రిజర్వేషన్లపై గంగుల పాట.. యూట్యూబ్‌లో..

Edited By: Krishna S

Updated on: Nov 24, 2025 | 7:32 PM

గంగుల కమలాకర్ గాయకుడిగా అవతారమెత్తారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమంపై ఆయన పాడిన పాట యూట్యూబ్‌లో విడుదలైంది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను ప్రధాన ఎజెండాగా మార్చి పోరాడుతోంది. ఈ ఉద్యమానికి ఊపు తీసుకురావడంలో గంగుల పాట కీలక పాత్ర పోషిస్తోంది.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ వేదికలపై ప్రసంగాలతోనే కాకుండా ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు. గంగుల తాజాగా బీసీ రిజర్వేషన్ ఉద్యమంపై ఒక పాట పాడి, దానిని యూట్యూబ్‌లో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్ పార్టీ. ఈ పోరాటంలో భాగంగా రకరకాల నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలకు వ్యూహరచన చేస్తోంది.

ప్రతి జిల్లాలో ఒక సభ, రాష్ట్రవ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటాలు చేయాలని పార్టీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఉద్యమాలకు ఊపు తీసుకురావడానికి పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సిద్ధం చేస్తోంది. ఈ సాంస్కృతిక విభాగంలో అందరికంటే ముందే అడుగు వేశారు గంగుల కమలాకర్. తాజాగా ఆయన స్వయంగా బీసీ ఉద్యమాలపై పాడిన పాట యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పాటపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా పలువురు నాయకులు గంగుల కమలాకర్‌ను అభినందించినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Nov 24, 2025 07:31 PM