గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్
షణ్ముఖ్ జశ్వంత్.. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు షణ్ను. దాంతో పాటే చాలా సార్లు కాంట్రో కింగ్‌గా మారి నెట్టింట తెగ వైరల్ అయ్యేవాడు. తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సెట్ చేసుకున్న షణ్నూ.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో సతమతమయ్యాడు.
నిత్యం ఏదోక వివాదంతో వార్తలలో నిలిచాడు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్.. ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరకు ఎలాంటి కంటెంట్ చేయకుండా.. ప్రేక్షకుల ముందుకు రాకుండా అజ్ఞాతంలో ఉండిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ సినిమాతో నెటిజన్స్ ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఈవెంట్‌లో కాస్త ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్‌పైనే ఏడ్చేశాడు. షణ్ముఖ్, అనఘ జంటగా తెరకెక్కిన లీల వినోదం సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రెస్ మీట్ ఈ మూవీ టీం నిర్వహించగా… ఆ మీట్‌లోనే ఎమోషనల్ అయ్యాడు షణ్నూ. సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన పక్కన ఉంటారని.. కానీ మనం పడినప్పుడు మన పక్కన ఉన్నవాళ్లే నిజమైన స్నేహితులంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: