Kiran Abbavaram: ఎంత మంచోడో.. తన సంతోషాన్ని అంధుల నవ్వులో చూసుకున్నాడు.! కిరణ్ అబ్బవరం
పెళ్లి తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క. ఇది అతని మొదటి పాన్ ఇండియా సినిమా కూడా. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ కిరణ్ అబ్బవరం సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు ప్రమోషన్లలో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ కూడా బాగా వైరలయ్యాయి.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన క సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజైన ప్రతి చోట నుంచి పాజిటవ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. కిరణ్ అబ్బవరం చాలా రోజుల తర్వాత మనసుకు సంతోషంగా ఉందంటూ సినిమా విజయంపై స్పందించాడు. ఇక క సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నారు. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం దేవ్‌నార్ ఫౌండేషన్ లోని అంధులతో కలిసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కిరణ్ అబ్బవరం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో అయినా చాలా సింపుల్‌గా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.