అఖండతో సంయుక్త, రివాల్వర్‌తో కీర్తి సక్సెస్‌ అవుతారా

Edited By:

Updated on: Nov 27, 2025 | 6:01 PM

సంవత్సరాంతం సమీపిస్తున్న తరుణంలో, సంయుక్త, కృతి శెట్టి, కీర్తి సురేష్, కృతి సనన్ వంటి హీరోయిన్స్ తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో లేదా సౌత్‌లో బలమైన స్థానం కోసం వీరు బిగ్ హిట్స్ ఆశిస్తున్నారు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినవారు, లేదా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నవారు, ఈ ఏడాది చివరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇయర్‌ ఎండింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ, ఎలాగైనా ప్రూవ్‌ చేసుకోవాలనే తపన ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో చాలా మంది హీరోయిన్లలో కనిపిస్తోంది. వాళ్లల్లో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన వారున్నారు. కచ్చితంగా ఒక్క సినిమాతో అయినా ప్రూవ్‌ చేసుకోవాల్సిన వాళ్లున్నారు. సౌత్‌లో నిలదొక్కుకోవాలన్న పట్టుదల ఉన్నవారూ ఉన్నారు.. ఇంతకీ వారెవరో మీరూ గెస్‌ చేస్తున్నట్టేగా? మరెందుకు ఆలస్యం.. చూసేద్దాం వచ్చేయండి. సంయుక్త సినిమాలో ఉంటే, హీరోయిన్‌ రోల్‌కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుందనే నమ్మకంతో ఉంటారు ఆడియన్స్. ఆషామాషీ క్యారక్టర్లకు ఈ అమ్మణి ఓకే చెప్పరన్నది అందరి మనసుల్లోని మాట. ఇదే ఫీలింగ్‌ ఉప్పెన సమయంలోకృతి శెట్టి మీద కూడా ఉండేది. కానీ ఎక్కడో ఆ తర్వాత ఆమె క్యాల్కులేషన్‌ మిస్‌ అయింది. రీసెంట్‌గా కింగ్‌డమ్‌తో మెప్పించిన భాగ్యశ్రీ, త్వరలోనే ఆంధ్రా కింగ్‌ తాలూకలో డిఫెరెంట్‌ రోల్‌తో పలకరించడానికి రెడీ అవుతున్నారు. కీర్తీ సురేష్‌కి పర్ఫెక్ట్ హిట్‌ పడి చాన్నాళ్లయింది. రకరకాలుగా ప్రయత్నించినా ఏదీ వర్కవుట్‌ కావడం లేదు. ఆమె నటించిన రివాల్వర్‌ రీటా అయినా సూపర్‌ సక్సెస్‌ అవుతుందా? అని ఎదురుచూస్తున్నవారు లేకపోలేదు. కృతి సనన్‌ కి కూడా ఈ ఇయర్‌ చాలా ఇంపార్టెంట్‌. ధనుష్‌తో ఆమె నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా హిట్‌ అయితే సౌత్‌లో స్ట్రాంగ్‌ బేస్‌ దొరికినట్టు అవుతుంది. చాన్నాళ్లుగా సౌత్‌లో సాలిడ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఈ లేడీకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..