జక్కన్న మెలిక ఇక.. కేమెరాన్ ఒప్పుకోక తప్పదుగా..
క్విడ్ ప్రోకో..! మన పొలిటీషిన్స్ కారణంగా ఒకప్పుడు తెలుగు స్టేట్స్‌లో విపరీతంగా పాపులర్ అయిన ఈ మాట.. ఇప్పుడు జక్కన్న కాంపౌండ్‌లో వినిపిస్తోంది. జక్కన్న క్విడ్ ప్రోకో పద్దతిలో SSMB29 సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జక్కన్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమెరాన్‌కు తనదైన రీతిలో సాయం చేసి.. తన సినిమాకు కామెరాన్ సాయం తీసుకోవాలని చూస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక అసలు విషయం ఏంటంటే…! SSMB29 ప్రమోషన్స్‌కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ తొలి ఈవెంట్‌కు హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కేమెరాన్ గెస్ట్‌గా హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో అవతార్ 3 రిలీజ్ కానున్న నేపథ్యంలో కేమెరాన్ ప్రమోషన్స్‌ను ఇండియా నుంచి మొదలెట్టాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే ఆస్కార్ ఈవెంట్లో జక్కన్నతో ఏర్పడిన పరిచయంతో కామెరాన్.. ఇండియాలో అవతార్ 3 ప్రమోషన్స్‌కు హెల్ప్ చేయాలని కోరారట. దీనికి ఓకే చెప్పిన జక్కన్న.. ఆయననూ ఓ ఫేవర్ అడిగారట. అదేంటంటే.. నవంబర్‌లో జరిగే SSMB29 సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లలో కామెరాన్‌నూ పాల్గొనాలని కోరాడట. దీనివల్ల తన మూవీకి వరల్డ్ వైడ్ ప్రచారం లభించటంతో బాటు మహేష్ ను గ్లోబల్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయవచ్చని జక్కన్న థింక్ చేస్తున్నారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!
బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్