హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

Edited By:

Updated on: Jan 20, 2026 | 3:58 PM

తమిళ దర్శకులు ఇప్పుడు తెలుగు హీరోలతో కలిసి పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్ స్టార్స్ కొరత, విజయ్ రిటైర్మెంట్ వంటి కారణాలతో అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి ప్రముఖ దర్శకులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి తెలుగు స్టార్స్‌తో ప్రాజెక్టులు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో తమదైన ముద్ర వేయడానికి ఇది వారికి ఒక మార్గం.

తమిళ దర్శకులు పక్క చూపులు చూస్తున్నారు. హోం గ్రౌండ్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకులు కూడా ఇప్పుడు పరభాషా హీరోల వైపు చూస్తున్నారు. ఆల్రెడీ కొత్త మంది దర్శకులు ఈ లిస్ట్‌లో చేరిపోగా.. మరికొంత మంది ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లెవరు అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. కోలీవుడ్‌లో కమర్షియల్ స్టార్స్ తగ్గిపోతున్నారు. దళపతి విజయ్‌ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అజిత్‌ సినిమాల మీద సీరియస్‌గా ఫోకస్ చేయటం లేదు. సూర్య లాంటి స్టార్స్‌ ఉన్నా… బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌లో సత్తా చూపించలేకపోతున్నారు. రజనీకాంత్, కమల్‌ హాసన్ లాంటి సీనియర్స్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా కలలు కంటున్న తమిళ దర్శకులు పరభాష హీరోల వైపు, ముఖ్యంగా తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. కోలీవుడ్‌లో వరుస బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చిన అట్లీ, జవాన్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. తాజాగా లోకేష్‌ కనగరాజ్‌ కూడా నేషనల్ మార్కెట్‌లో ప్రూవ్ చేసుకునేందుకు బన్నీతో మూవీకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. మరో సక్సెస్‌ఫుల్ తమిళ దర్శకుడు నెల్సన్ కూడా టాలీవుడ్ స్టార్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా నెల్సన్ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జైలర్ 2 తరువాత ఆ ప్రాజెక్ట్‌నే పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు నెల్సన్‌. కోలీవుడ్‌ స్టార్స్‌ సైడ్‌ అవుతుండటంతో మరికొంత మంది దర్శకులు కూడా ఇతర భాషల హీరోల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

టాయిలెట్‌లో పేపర్‌‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

SBI New Rules: రూల్స్‌ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత

Pomegranate Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. ఇంక అంతే సంగతులు

పారాసిటమాల్ వాడకంపై ఆందోళన వద్దు.. అధ్యయనం ఏం చెప్పిందంటే