కేరళ వెళ్తున్న కథలు.. కలిసొస్తున్న కలెక్షన్లు

Updated on: Jan 29, 2026 | 9:50 AM

టాలీవుడ్‌లో కేరళ బ్యాక్‌డ్రాప్ కథలకు డిమాండ్ పెరుగుతోంది. సింహాద్రి నుండి 'కే ర్యాంప్', 'నారీ నారీ నడుమ మురారి' వంటి చిత్రాలు కేరళ నేపథ్యంతో విజయాలు సాధించాయి. రవితేజ రాబోయే 'ఇరుముడి' కూడా ఇదే సెంటిమెంట్‌ను అనుసరిస్తోంది. ఈ 'కేరళ స్టోరీ' ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒక విజయవంతమైన ఫార్ములాగా మారింది.

టాలీవుడ్ అనే కాదు.. ఏ ఇండస్ట్రీ అయినా కూడా హిట్టిచ్చిన సెంటిమెంట్ వదులుకోడానికి అంత ఈజీగా ఇష్టపడరు హీరోలు. కలిసొచ్చిన సెంటిమెంట్ వైపే అడుగులేస్తుంటారు. అలా తెలుగులో ఈ మధ్య కేరళ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కథలకు డిమాండ్ పెరిగింది.. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో అంతా అదే కావాలంటున్నారు. మరి ఈ కేరళ స్టోరీపై ఓ లుక్ వేద్దామా..? కేరళ బ్యాక్‌డ్రాప్ కథలకు తెలుగులో డిమాండ్ పెరిగిపోతుందిప్పుడు. 20 ఏళ్ళ కిందే సింహాద్రి తెలుగులో కేరళ నేపథ్యం ఉన్న కథలకు పునాది వేసింది. ఆ తర్వాత ఏ మాయ చేసావే లాంటి సినిమాలు కూడా మాయ చేసాయి. గతేడాది నుంచి కేరళ కథలు ఇంకాస్త ఎక్కువగా రాస్తున్నారు మన దర్శకులు.. కే ర్యాంప్ అలా వచ్చి సక్సెస్ కొట్టిందే. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ కథలో చాలా భాగం కేరళలోనే జరుగుతుంది. దివాళికి విడుదలైన ఈ చిత్రం పోటీలో కూడా విజయం సాధించింది. ఇక సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారిలో హీరో, హీరోయిన్ ట్రాక్ అంతా కేరళ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇది కూడా సూపర్ హిట్ అయింది.. సినిమాకు ఈ కేరళ ఎపిసోడ్ బాగా హెల్ప్ అయింది. తాజాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాలోనూ కేరళ నేపథ్యమే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి అంటేనే కేరళ.. పైగా టైటిల్ కూడా ఇరుముడి అని పెట్టారు మేకర్స్. కథలో చాలా భాగం కేరళ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండబోతుంది. సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. రవితేజ వేచి చూస్తున్న హిట్ ఇరుముడితో రావడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

Bhagavanth Kesari Sequel: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ