War 2 Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు సినిమా ఆపేశారు.. కారణం తెలిస్తే మీకూ కోపం రాకమానదు

Edited By:

Updated on: Aug 14, 2025 | 12:26 PM

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 మూవీకి కొంతసేపు అంతరాయం కలిగింది. సౌండ్ లేదంటూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆత్మకూరు పట్టణంలోని రంగమహాల్ థియేటర్‌లో వార్-2 సినిమా

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 మూవీకి కొంతసేపు అంతరాయం కలిగింది. సౌండ్ లేదంటూ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆత్మకూరు పట్టణంలోని రంగమహాల్ థియేటర్‌లో వార్-2 సినిమా నడుస్తుండగా మధ్యలో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం రావడంతో యాజమాన్యంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొడవకి దిగారు. యాజమాన్యం 30 నిమిషాల పాటు మూవీ నిలిపివేసి, ప్రాబ్లం సాల్వ్ చేశారు. దీంతో సినిమాను మళ్ళీ రిపీట్ చేసి వేయడంతో గొడవ సద్దుమణిగింది.