కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. కాంట్రవర్సీ ఏంటంటే?

Updated on: May 13, 2025 | 8:06 AM

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్‌సీబీ కి ఫస్ట్ ట్రోఫీ అందించాలనే కసితో ఆడుతున్నాడు. ఈ టైంలో ఊహించని వివాదంలో విరాట్ పేరు వినిపిస్తుంది. విరాట్ తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ పేరు కూడా ఈ కాంట్రవర్సీలో నానుతుంది. వీళ్లిద్దరితో పాటు స్టార్ సింగర్ రాహుల్ వైద్య కూడా ఈ వివాదంలో కీలకంగా ఉన్నాడు. అసలు ఏంటి ఈ కాంట్రవర్సీ? రాహుల్ తో కోహ్లీ అనుష్కకు ఉన్న లింక్ ఏంటి? ఈ వివాదంలో తప్పు ఎవరిదే? అవనీత్ కౌర్ అనే నటి ఫ్యాన్ పేజీ పోస్టుకు ఇటీవల లైక్ కొట్టాడు కోహ్లీ. అయితే కొద్ది సేపటికే లైక్ ని తొలగించాడు. ఇది సరిగ్గా అనుష్క శర్మ బర్త్ డే నాడు జరిగింది. దీంతో నెట్టింట దీనిపై చర్చలు జరిగాయి.

కోహ్లీ లైక్ కొట్టి మళ్ళీ ఎందుకు తీసేసినట్లు చర్చలు కూడా జరిగాయి. కొందరు దీన్ని సాంకేతిక లోపంగా భావించగా ఇంకొందరు అనుష్కను అనవసరంగా ఇందులోకి లాగారు. ఆమెను టార్గెట్ చేస్తూ రూమర్స్ పుట్టించారు. దీనిపై ఇన్‌స్టాలో కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇది హల్గారిధం లోపం వల్ల జరిగిందన్నాడు. అయితే దీనిపై సింగర్ రాహుల్ వైద్య సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. దీంతో వివాదం మరింత రాజుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్లో పాట పాడుతూ అనుష్క శర్మ చేతికి ముద్దు పెట్టాడు రాహుల్ వైద్య. ఇది జరిగిన కొన్నాళ్లకు రాహుల్ ని ఇన్‌స్టాలో బ్లాక్ చేశాడు కోహ్లీ. అది మనసులో పెట్టుకున్న రాహుల్ వైద్య తాజా కాంట్రవర్సీలో దూరాడు. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం కోహ్లీని బ్లాక్ చేసిందేమోనంటూ విరాట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా రచ్చుగొట్టేలా కామెంట్ చేశారు. ఇదే సమయంలో అప్పట్లో అనుష్క చేతికి రాహుల్ కిస్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా సాగుతుంది. దీంతో అతనిపై కోహ్లీ ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోతున్నారు. రాహుల్ వైద్యను నెట్టింట ఏకిపారేస్తున్నారు. కోహ్లీ పైన సెటైర్లు వేస్తారా అంటూ సీరియస్ అవుతున్నారు. అనుష్క వీడియో కావాలనే బయటకు తెచ్చామంటూ గరం గరం అవుతున్నారు. ఈ కాంట్రవర్సీకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో

 

 

Published on: May 13, 2025 08:02 AM