Vijay Thalapathy: ఒకే ఇయర్‌., 1000 కోట్లు.. ఏంది సామి.. ఈయన అరాచకం.! విజయ్ రికార్డ్స్.

|

Dec 27, 2023 | 12:55 PM

దక్షిణాదిలో ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు దాటింది. ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు హీరోలు. అలాగే.. ఇటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ చిత్రాలు ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది భారీ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్టార్ హీరోస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.

దక్షిణాదిలో ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు దాటింది. ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు హీరోలు. అలాగే.. ఇటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ చిత్రాలు ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది భారీ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్టార్ హీరోస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. షారుఖ్, సల్మాన్, ప్రభాస్, విజయ్ సేతుపతి, చిరంజీవి, బాలకృష్ణ ఖాతాల్లో సూపర్ హిట్స్ చేరాయి. కానీ ఓ హీరో మాత్రం ఈ సంవత్సరం ఏకంగా 1000 కోట్లు సంపాదించి అతిపెద్ద ఘనత సాధించారు. అతనెవరో తెలుసా ?.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళంలో సూపర్ స్టార్ హీరో.. అతడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే లియో సినిమాతో హిట్ అందుకున్న విజయ్.. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి 68లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమా రికార్డుల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిసున్నాయి. ఆయనతో షూటింగ్ చేసిన నిర్మాతలకు భారీ లాభాలు వస్తున్నాయి. అందుకోసం ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. విజయ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించాడు. సంక్రాంతి పండుగ సందర్బంగా విజయ్ నటించిన వారసుడు విడుదల కాగా లియో అక్టోబర్‌లో విడుదలైంది. ఆ తర్వాత, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన లోకేష్ కనగరాజ్-విజయ్ కలయికలో వచ్చిన లియో కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ సంవత్సరం దళపతి విజయ్ తన చిత్రాల ద్వారా తమిళ చిత్రసీమలో దాదాపు వెయ్యి కోట్ల ఆదాయాన్ని సంపాదించాడు.ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ధనంజయన్ తెలిపారు. ఈ ఏడాది తమిళ సినిమా 3500 కోట్లు రాబట్టిందని… ఈ ఆదాయంలో దాదాపు వెయ్యి కోట్లతో విజయ్ సినిమా అగ్రగామిగా నిలిచిందని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 27, 2023 12:48 PM