బన్నీకే మొదటి ప్రాధాన్యత దీపిక నిర్ణయంతో.. బాలీవుడ్ మేకర్స్ షాక్
'పుష్ప', పుష్ప 2 సినిమాల తర్వాత, అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు. వీరి కాంబినేషన్ లో ఓ హాలీవుడ్ తరహా సినిమా తెరకెక్కనుంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ మీడియా కోట్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్‌లో హీరోయిన్ దీపిక కూడా జాయిన్ అయినట్టు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో.. దీపిక హీరోయిన్‌గా ఎప్పుడో ఫిక్స్ అయింది. ఈ సినిమా కోసం సరిగ్గా 100 రోజుల కాల్షీట్ ఇచ్చిందనే టాక్ కూడా బీ టౌన్ లో ఉంది. అయితే సంజయ్ లీలా భన్సాలీ సినిమాకు కూడా ఈమె ఇంత పెద్ద కాల్షీట్ ఇవ్వలేదని.. కానీ బన్నీ సినిమాకు మాత్రం దీపిక ఇన్ని రోజులు కేటాయించదని బాలీవుడ్ మేకర్స్ చెప్పుకుంటున్నట్టు న్యూస్. అంతేకాదు ఇది దీపిక తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా అల్లు అర్జున్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి గతంలో అట్లీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’లో విలన్ పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బన్నీ మూవీలో కూడా విజయ్ విలన్ తరహా పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం! ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా..