Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌

Updated on: Apr 29, 2025 | 6:01 PM

టాలీవుడ్ రౌడీ బాయ్ గా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ వ్యాపారంలోనూ అదరగొడుతున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో సెలెబ్రిటీలకు స్పెషల్ దుస్తుల్ని డిజైన్ చేస్తుంటాడు. ఈ రౌడీ వేర్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక రౌడీ బ్రాండ్లలో కొత్త డిజైన్లు వస్తే వాటిని ముందుగా అల్లు అర్జున్‌కే పంపిస్తుంటాడు విజయ్ దేవరకొండ.

గతంలో పలు సార్లు తన రౌడీ వేర్స్ ను బన్నీకి పంపాడు విజయ్. ఆ మధ్యన ‘పుష్ప 2’ రిలీజ్‌ సందర్భంగా ‘పుష్ప’ పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు. తాజాగా విజయ్ దేవర కొండ తన రౌడీ బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా మరోసారి రౌడీ వేర్స్‌ను అల్లు అర్జున్ కు పంపించాడు విజయ్. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విజయ్ తనకు పంపిన గిఫ్ట్స్ ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. ‘మై స్వీట్‌ బ్రదర్‌.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు. సో స్వీట్‌’ అని విజయ్ పై ప్రేమను కురిపించాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్‌ దళపతి

ఇండస్ట్రీ డార్క్‌ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్

పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్‌ అంటే

Manchu Vishnu: ప్రభాస్ పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

Suriya: ప్రియదర్శికి స్టార్ హీరో సూర్య నుంచి షాకింగ్ గిఫ్ట్