Kingdom Pre Release Event: హైదరాబాద్‌లో కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు.. లైవ్
Kingdom Movie Pre Release E

Kingdom Pre Release Event: హైదరాబాద్‌లో కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు.. లైవ్

Updated on: Jul 28, 2025 | 8:07 PM

.టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా కింగ్ డమ్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలకు ఇంకా కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

కింగ్డమ్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌  ప్రారంభమైంది. యూసుఫ్ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌ వేదికగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ సూపర్ హిట్ కావటంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అంతకు మించి రెస్పాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. సాయంత్రం ఏడు గంటలకు ఈవెంట్ మొదలు కాగా, మధ్యాహ్నం నుంచే వేదిక దగ్గర ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌లో అనిరుధ్‌ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. గతంలో అనిరుధ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పెర్ఫామ్ చేసిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కింగ్డమ్ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కింగ్డమ్‌ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. విజయ్ అన్న పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌, టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Published on: Jul 28, 2025 06:48 PM