Jailer 2: విద్యాబాలన్ రీ-ఎంట్రీ.. పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్న ముద్దుగుమ్మ

Updated on: Dec 16, 2025 | 5:15 PM

విద్యాబాలన్ సౌత్ సినిమాలోకి తిరిగి వస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సీక్వెల్‌లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారని ధృవీకరించబడింది. సినిమాలో ఆమె పాత్ర ప్రధాన మలుపునకు కారణమవుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత తెలుగులో ఆమెకు ఇది పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ కానుంది. నీల్-తారక్ కాంబో సినిమాలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.

విద్యాబాలన్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత తెలుగులో నటించకపోయినా, ఆమె తిరిగి వస్తున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సీక్వెల్, అంటే జైలర్ 2లో విద్యాబాలన్ నటిస్తారనే వార్త ఇప్పుడు ధృవీకరించబడింది. ఈ సినిమాలో విద్యాబాలన్ ఒక బలమైన మహిళా పాత్రలో కనిపించనున్నారని, ఆమె పాత్ర సినిమాకు ప్రధాన మలుపుగా మారుతుందని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్స్‌లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె కనిపించనుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thaman: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. త‌మ‌న్ షాకింగ్ కామెంట్స్

పక్కా ప్లానింగ్ తో ఉన్న భాగ్యశ్రీ, రుక్మిణి.. 2026 మాదే అంటున్న ముద్దుగుమ్మలు

Nani: బిగ్ క్లాష్‌కు రెడీ అంటున్న నేచురల్ స్టార్‌

The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్‌

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే