వరుణ్ తేజ్-లావణ్య తనయుడి పేరు ఇదే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడికి నామకరణం చేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కుమారుడి పేరును రివీల్ చేశారు. ఆంజనేయస్వామి దయతో పుట్టిన బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని నామకరణం చేశామన్నారు. మీ అందరి దీవెనెలు కావాలని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తమ జీవితంలోకి వచ్చిన అతిపెద్ద ఆశీర్వాదానికి ఇప్పుడు ఒక పేరు వచ్చిందంటూ వరుణ్ తేజ్ ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. తమ కుమారుడి పేరు వెనుక ఉన్న అర్థాన్ని కూడా ఈ జంట వివరించింది. తన ప్రియమైన కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలని అందరికీ పరిచయం చేస్తున్నామని.. ఈ పేరుకు ఆగని శక్తి, భక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక తేజస్సు అని అర్థమని చెప్పారు. హనుమంతుడి స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు రాకతో కొణిదెల కుటుంబంలోనే కాకుండా, మెగా అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ మద్యలోనే నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. మనవడిని చూసి మురిసిపోయారు. “కొణిదెల కుటుంబంలోకి చిన్నారికి స్వాగతం. తల్లిదండ్రులైన వరుణ్, లావణ్యలకు హృదయపూర్వక అభినందనలు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను ఈ జంట పంచుకుంది. ఇప్పుడు విజయదశమి నాడు తమ కుమారుడి పేరును ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమకథ అందరికీ తెలిసిన విషయమే. 2017లో ‘మిస్టర్’ సినిమా ద్వారా కలిసిన ఈ జంటకు, ఆ తరువాత ‘అంతరిక్షం’ చిత్రంలో కలిసి నటించే అవకాశమొచ్చింది. అప్పటి నుంచి ఏర్పడ్డ సాన్నిహిత్యం ప్రేమగా మారి, చివరకు 2023 జూన్‌లో ఎంగేజ్మెంట్, అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో వైభవంగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాను అంటూ ఈ మే నెలలో సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ రియాలిటీగా మారింది. మెగా వారసుడి రాకతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. #MegaBaby, #VarunLavBaby అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
