Matka: అదిరిపోయిన మట్కా గ్లింప్స్.. వరుణ్‌కు పాన్ ఇండియా హిట్టు పడ్డట్టే
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మట్కా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు.. వైవిధ్యమైన కథలతో అడియన్స్ ముందుకు వస్తున్న వరుణ్.. ఈసారి 1960 బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంబ్లింగ్ కథతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మట్కా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు.. వైవిధ్యమైన కథలతో అడియన్స్ ముందుకు వస్తున్న వరుణ్.. ఈసారి 1960 బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంబ్లింగ్ కథతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇక తాజాగా వరుణ్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కాసేపటి క్రితమే మట్కా గ్లింప్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ ఆసక్తిగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఇందులో వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారని గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. వీడియో మధ్యలోనే ఎవరికో ప్రామిస్ చేసినట్లుగా చూపించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో వరుణ్ స్టైలీష్ లుక్ ఉండనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా జీవీ ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే కానుందనే విషయం గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: