Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

Updated on: Mar 15, 2026 | 8:57 PM

"ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా విడుదలైన మూడవ సింగిల్ "కలరే ఎత్తరా" భారీ రెస్పాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్‌, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భారీ సెట్‌, 1200 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో తెరకెక్కిన ఈ పాట ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది.

“ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, తాజాగా మూడవ సింగిల్ “కలరే ఎత్తరా” పాటను విడుదల చేసింది. ఈ మాస్ సాంగ్ లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్ చేయడంతో ఈ పాట తక్షణమే వైరల్‌గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, రామ్ మిరియాల గానం ఈ పాటకు మరింత శక్తిని చేకూర్చాయి. భారీ సెట్‌లో సుమారు 1200 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఈ పాటను చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఇప్పటివరకు రూపొందించిన చిత్రాలలో ఇదే అత్యంత ఖరీదైన పాటగా ప్రచారం జరుగుతోంది. దినేష్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటలో పవన్ కళ్యాణ్‌తో పాటు రాశి ఖన్నా కూడా కనిపించారు. సినిమా కథను వెల్లడించకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్, క్రేజ్‌లపైనే దృష్టి సారించే వ్యూహాన్ని చిత్ర బృందం ఈ పాట విషయంలోనూ అనుసరించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఉస్తాద్ భగత్ సింగ్” ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా

Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌

ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే

ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం

Follow Us