మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సంక్రాంతి పండగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. బెంగుళూరులోని తమ ఫాంహౌస్లో ఈఏడాది ఫెస్టివల్ అంతా కలిసి ఒక్కచోట చేరి సరదాగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్, వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సంక్రాంతి పండగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. బెంగుళూరులోని తమ ఫాంహౌస్లో ఈఏడాది ఫెస్టివల్ అంతా కలిసి ఒక్కచోట చేరి సరదాగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్, వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గరిటె పట్టి దోశలు వేస్తూ కనిపించారు. అలాగే మరొకటి మెగాస్టార్ సతీమణి సురేఖ తన మనవరాలు మెగా ప్రిన్సెస్ క్లింకారాతో ఎంతో సంతోషంగా గడుపుతూ కనిపించారు. గతంలో చిరు కూడా పండగ సందర్భాల్లో దోశలు వేసిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ కూడా దోశలు వేస్తూ కనిపించారు. అయితే చెర్రీకి దోశలు వేయడం తన తల్లి దగ్గరుండి నేర్పించినట్లుగా ఉపాసన షేర్ చేసిన క్యాప్షన్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోస్, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ సంక్రాంతికి మెగా మనవరాలు.. కొత్త కోడలు అడుగుపెట్టారు. కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు రావడంతో ప్రస్తుతం ఈసారి సంక్రాంతికి ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక జనవరి 13న పంజా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

