అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు

|

Nov 23, 2024 | 8:41 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యారు. ఇందులో పుష్ప 2 సినిమాతోపాటు తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇదివరకే ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ షోలో బన్నీ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈసారి తల్లితోపాటు ఇద్దరు పిల్లలతో కలిసి బన్నీ సందడి చేశారు. ఈ క్రమంలోనే రిలేషన్‌ షిప్‌లో వచ్చే భిన్నాభిప్రాయాలపై బన్నీ మాట్లాడిన మాటలు.. ఏకంగా బాలయ్యనే ఇంప్రెస్‌ అయ్యేలా చేశాయి. ఇక బాలయ్య అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా.. తన మ్యారెజ్ లైఫ్ గురించి మాట్లాడిన బన్నీ.. ప్రతి రిలేషన్ షిప్ లోనూ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. అయితే వాటిని గౌరవించుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. తాను.. తన ఒకే ఇంట్లో ఉంటామని..ఈ ప్రపంచంలో తన నాన్న కంటే ఇష్టమైన వ్యక్తి మరెవ్వరూ లేరని..అయినా తమ మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయాలు వేరుగా ఉంటాయని.. ఆ భేదం ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ వరకే అని.. మొత్తం తన నాన్న తో విభేదించడం కాదని ఉదహరిస్తూ చెప్పాడు. రిలేషన్ షిప్ లో అందరూ ఒక విషయంలో నో చెబితే తనకు నో చెప్పాడని భావిస్తారని..కానీ అక్కడ ఒక విషయానికి మాత్రమే నో చెబుతారు తప్ప ఆ మనిషి కాదంటూ చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ రిలేషన్ షిప్ బాగుంటుందంటూ బాలయ్యకు వివరించాడు బన్నీ. అయితే బన్నీ నోటి నుంచి వచ్చి ఈ మాటలే బాలయ్యను ఫిదా చేశాయి. నాకు నచ్చవయ్యా అనే కామెంట్ బాలయ్య నోటి నుంచి వచ్చేలా చేశాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌

ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!

తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్‌ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్

Renu Desai: రేణు ఇంట తీవ్ర విషాదం !! దుఃఖంలో అకీరా తల్లి

పెళ్లి కొడుకు రాలేదని.. ఆగిపోయిన రైలు