‘కడుపు మంటతో.. నిజం చెప్పి..’ టీవీ షోలపై ఉదయభాను సంచలన కామెంట్స్
యాంకర్ గా ఉదయభాను స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఉదయ భాను.. ఈ మధ్య కనిపించకుండా పోయారు. కట్ చేస్తే.. రీసెంట్‌గా ఓ ఈవెంట్లో కనిపించి.. అందరూ షాకయ్యే కామెంట్స్ చేశారు. యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని చెప్పి... బుల్లి తెర ఇండస్ట్రీలో మంటలు రేపారు. ఇప్పుడు మరో లేటెస్ట్ ఇంటర్వ్యూలో టీవీ షోలపై సంచలన కామెంట్లు చేశారు.
అందరూ అనుకున్నట్టు టీవీ షోలన్నీ నిజం కావని.. అక్కడ తిట్టుకునేది, కొట్టుకునేది, చివరకు నవ్వుకునేది కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ కామెంట్స్‌తో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు ఈమె. తాను గతంలో చాలా రియాల్టీ షోలు చేశాను. కానీ అందులో చేసేవి నచ్చక ఎప్పుడో మానేశాను. అక్కడ మనం చేయడానికి ఏమీ ఉండదు. అసలు ఎందుకు ఆ షోలు చేశానా అని ఇప్పటికీ బాధపడుతుంటాను అంటూ చెప్పుకొచ్చారు ఉదయభాను. తనకు చాలా షోలకు కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదని.. కొంత మంది ప్రొడ్యూసర్లు చెక్కులు ఇచ్చినా అవి చెక్ బౌన్స్ అయినట్టు చెప్పారు ఉదయ భాను. అలాంటి చెక్కులు తన వద్ద బోలెడన్ని ఉన్నాయని కూడా వివరించారు. తనను తొక్కేయడానికి ఎంతో మంది ప్రయత్నించారని.. తనను షో మధ్యలో నుంచి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఈవెంట్లకు అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ మినిట్ లో తీసేసేవాళ్లని ఎమోషనల్ అయ్యారు ఉదయభాను. త్వరలోనే ఇండస్ట్రీలో తన మీద జరిగిన కుట్రల గురించి బయట పెడుతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తన మాటలతో ఇప్పుడొక్క సారిగా.. ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయారు ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీకి ముగ్దుడైన పీఎం సాబ్.. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
స్టార్ హీరో కొడుకు కోసం.. ముగ్గురు హీరోయిన్లు?
కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..
‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..
‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు