అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు

Updated on: Jan 20, 2026 | 6:06 PM

దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న త్రిష, ఛార్మీ స్నేహ బంధానికి నికిషా పటేల్ కూడా తోడైంది. ఈ ముగ్గురు టాలీవుడ్ తారలు దుబాయ్‌లో సందడి చేశారు. బ్లూవాటర్ ఐలాండ్‌లో జరిగిన ఈ గర్ల్స్ ట్రిప్ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పౌర్ణమి సినిమాతో మొదలైన వీరి అనుబంధం అభిమానులను ఆకట్టుకుంటోంది.

దాదాపు 20 ఏళ్ల నాటి అనుబంధం వారిది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు హీరోయిన్లు దుబాయ్‌లో సందడి చేసారు. రీయూనియన్‌ జరుపుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తీసుకున్న పిక్స్ ఫాన్స్‌ని ఖుషీ చేస్తున్నాయి. ఛార్మీ త్రిష వీరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల క్రితం పౌర్ణమి సినిమాలో వీరిద్దరూ అక్కచెల్లెళ్లుగా నటించారు. పౌర్ణమిలో మొదలైన స్నేహం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. పౌర్ణమి తర్వాత త్రిష టాప్ హీరోయిన్‌గా తెలుగులో వరుస సినిమాలతో హిట్లు కొట్టింది. ప్రస్తుతం త్రిష తమిళంలో వరుస సినిమాలతో బిజీగా మారింది. ఛార్మీ టాలెంట్‌ ఉన్న హీరోయిన్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. వీరి మరో బెస్ట్‌ ఫ్రెండ్‌ నికిషా పటేల్ గుర్తుందా. పవన్ కళ్యాణ్ సరసన కొమురం పులిలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ నికిషా పటేల్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు దుబాయ్ ట్రిప్‌లో వీరు సరదాగా తీసుకున్న ఫోటోలు ఫాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఒక ఫోటోలో త్రిష, ఛార్మీ ఉండగా మరికొన్ని ఫోటోలలో ముగ్గురు నవ్వుతూ సరదాగా గడిపిన క్షణాలు కనిపించాయి. ఛార్మీ ఈ ఫోటోలకు “ఈ అమ్మాయిలకు నేను అడిక్ట్ అయ్యాను” అంటూ క్యాప్షన్ ఇవ్వగా, నికిషా “బ్లూవాటర్ ఐలాండ్‌లో గర్ల్స్ ట్రిప్ రీయూనియన్” అంటూ తన ఆనందాన్ని షేర్ చేసింది. ఈ ముగ్గురు కలిసి దుబాయ్ వేదికగా రీయూనియన్ పార్టీ జరుపుకోవడం టాలీవుడ్ అభిమానులకు నాస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తోంది. సంవత్సరాలు గడిచినా వీరి మధ్య స్నేహం కొనసాగడం చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రీయూనియన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా, మరోసారి ఈ ముగ్గురిని కలిసి వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు

తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు

Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా

కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా