టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్‌

Updated on: Dec 19, 2025 | 5:45 PM

సినిమా పరిశ్రమలో అందం కీలక పాత్ర పోషిస్తుంది. IMDB ఆధారంగా ఇన్ఫోడెక్స్‌ వరల్డ్‌ వైడ్ విడుదల చేసిన 'అత్యంత అందమైన టాప్ 10 హీరోయిన్లు' జాబితాలో మార్గోట్ రాబీ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ నుండి కృతి సనన్ మాత్రమే టాప్ 5లో చోటు దక్కించుకోవడం విశేషం. షైలీన్ వుడ్లీ, దిల్‌రుబా దిల్మురాత్, నాన్నీ మెక్‌డోనీ వంటివారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే అభినయంతో పాటూ అందమూ చాలా ముఖ్యం. కొన్ని సార్లు కేవలం గ్లామర్ నే ప్రాతిపదికన తీసుకుని సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా ఈ ఏడాది అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా ఒకటి రిలీజ్ అయ్యింది. IMDB లిస్ట్ ఆధారంగా ఇన్ఫోడెక్స్‌ వరల్డ్‌ వైడ్ టాప్‌ టెన్‌ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ అందాల తారల జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క హీరోయిన్ కృతి మాత్రమే స్థానం దక్కించుకోవడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ రెండో స్థానంలో నిలవగా.. మూడు, నాలుగు స్థానాల్లో చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. ఇక ఇండియన్ బ్యూటీ కృతి సనన్.. టాప్‌-5 లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత 6వ స్థానంలో పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఏడవ స్థానంలో స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, ఎనిమిదో స్థానంలో పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, తొమ్మిదో స్థానంలో అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, పదో స్థానంలో టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్‌ నిలిచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పఠాన్‌ 2లో మన టైగర్‌.. NTRను నమ్ముకున్న షారుఖ్

300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..

Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం