TOP 9 ET: మాటలతో ఏడిపించిన ఉత్తమ నటుడు..! బిగ్ హిట్ దిశగా మిస్టర్ షెట్టి ఫిల్మ్..

|

Sep 17, 2023 | 11:25 AM

మరో బాలీవుడ్ స్టార్ కిడ్ సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఖుషీ కపూర్‌ త్వరలో ఓ తమిళ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో ఖుషీ సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఖుషి నటించిన వెబ్ సిరీస్‌ ఆర్చీస్‌ త్వరలో స్ట్రీమ్ కానుంది.క్రిస్మస్ సినిమాలకు ఆక్వామెన్ సినిమాతో పెద్ద దెబ్బ పడబోతుంది.

01.NTR
సైమా బెస్ట్ యాక్టర్‌ గా.. ట్రిపుల్ ఆర్‌ సినిమాకు గాను.. నామినేట్ అయిన తారక్‌.. అందరూ అనుకున్నట్టే.. ఆ అవార్డ్‌ను గెలుచుకున్నారు. అందరి అరుపుల మధ్యలో.. ఠీవీగా.. సైమా అవార్డ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు.. ఈ క్రమంలోనే.. మరో సారి తన మాటలతో.. అందరి మనసులు గెలుచుకున్నారు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు… నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు… నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు… నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నా అంటూ.. చెప్పారు. ఆ ఒక్క అందరి కళ్లలో నీళ్లు తిరిగేలా చేశారు యంగ్ టైగర్.

02. Miss Shetty
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. గతవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పటికీ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేస్తుంది మిస్ శెట్టి. అక్కడ ఇప్పటికే 1.4 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఈ చిత్రం.. ఫుల్ రన్‌లో 1.8 నుంచి 2 మిలియన్ డాలర్స్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

03. Nani
ఖుషి సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ తాజాగా నాని హాయ్ నాన్న సినిమాతో వచ్చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలైంది. హేషం మునుపటి సాంగ్స్‌లాగే.. మెలోడీగా సాగుతూ.. అందర్నీ ఆకట్టుకుంటోంది ఈ సాంగ్.

04.Skanda
రామ్‍ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 28న విడుదల కానున్న సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా సినిమాలోని మాస్ పాట కల్ట్ మామాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 18న విడుదల కానుంది ఈ పాట.

05. Yatra 2
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనూ పొలిటికల్ హీట్ నడుస్తుంది. తగ్గేదే లే అంటూ రాజకీయ సబ్జెక్ట్స్‌తో రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నారు హీరోలు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు యాత్ర 2 రానుంది. వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు మహి వి రాఘవ్. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో సెప్టెంబర్ 20 నుంచి మమ్ముట్టి జాయిన్ కానున్నారు. ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు ఈ మెగాస్టార్.

06.Devil
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెవిల్‌. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు. షూటింగ్ ప్రారంభించిన సమయంలో నవీన్‌ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్నట్టుగా వెల్లడించారు మేకర్స్‌. తాజాగా ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌ సందర్భంగా నిర్మాత దర్శకుడు అభిషేక్ నామా అంటూ ఎనౌన్స్ చేయటం ఆసక్తికరంగా మారింది.

07.Dunki
ఈ ఏడాది పఠాన్‌, జవాన్ సినిమాలతో రెండు బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చిన షారూఖ్‌ ఖాన్ హ్యాట్రిక్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ముందు నుంచి చెప్పినట్టుగానే డంకీ సినిమా కూడా ఈ ఇయరే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డంకీ, డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

08.Kushi Kapoor
మరో బాలీవుడ్ స్టార్ కిడ్ సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఖుషీ కపూర్‌ త్వరలో ఓ తమిళ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో ఖుషీ సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఖుషి నటించిన వెబ్ సిరీస్‌ ఆర్చీస్‌ త్వరలో స్ట్రీమ్ కానుంది.

09.Aquamen
క్రిస్మస్ సినిమాలకు ఆక్వామెన్ సినిమాతో పెద్ద దెబ్బ పడబోతుంది. ఈ సినిమా రాకతో ఓవర్సీస్‌లో హాయ్ నాన్నతో పాటు సైంధవ్‌, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలకు భారీ దెబ్బ తప్పదనే టాక్ వస్తోంది. అలాగే తెలుగులోనూ దీన్ని భారీగానే విడుదల చేస్తున్నారు హాలీవుడ్ మేకర్స్. పైగా ట్రైలర్ కూడా ఇప్పటికే సూపర్ డూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో… తెలుగు సినిమాలు కలెక్షన్లు దెబ్బతినే అవకాశం ఉందన చెబుతున్నారు ఫిల్మ్ అనలిస్టులు. ఇక ఆక్వామ్యాన్ సినిమా.. డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..